![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -57 లో.....నందుని మురళి పెళ్లి చేసుకున్నాడని ఇద్దరిని శాంతి ఇంట్లోకి రానివ్వదు. దాంతో వాళ్ళు శారద ఇంటికి వెళ్తారు. అక్కడున్న వాళ్ళంతా శాంతి సంగతి తెలిసిందే కదా కట్నం తీసుకొని రాలేదని లోపలికి రానివ్వలేదనుకుంటా అయిన పెళ్లి చేసుకున్నాక అత్తారింట్లో ఉండాలి కానీ ఇలా పుట్టింట్లోకి రావడం ఏంటని అక్కడ అంటుంటే ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు. మా అత్త రానివ్వడం లేదని అందరిపై నందు కోప్పడుతుంది.
మీరు పెళ్లికి వచ్చారు.. చూసారు.. మా ఇంటి విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దని పెళ్ళికి వచ్చినవాళ్ళతో జాను అంటుంది. ఆ తర్వాత నందు, మురళిలకి గౌతమి హారతి ఇస్తుంది. అత్త ఇంట్లోకీ అయితే కుడి కాలు అంటారు. ఇప్పుడు ఏ కాలు పెట్టి వస్తుందని అక్కడ వాళ్ళు అంటుంటే నందు కోపంగా ఒక్కతే లోపలికి వెళ్తుంది. అక్కడ శంకర్ ఫోటోని చూస్తూ ఏడుస్తుంది. మరొకవైపు సూర్యకి భువన ఫోన్ చేస్తుంది. తను లిఫ్ట్ చెయ్యదు. దాంతో వాయిస్ మెసేజ్ పెడుతుంది. ఇద్దరు వాయిస్ మెసేజ్ ద్వారానే మాట్లాడుకుంటారు. అప్పుడే సింహాద్రితో కార్ లో రౌడీలు వెళ్లడం సూర్య చూస్తాడు. వాళ్ళని ఫాలో అవుతాడు. రౌడీలని సింహాద్రి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. తోట మీదే అయింది. ఇక మేనల్లుడుని అల్లుడు చేసుకొని ఆ ఆస్తులు కూడా మీకే అవుతాయని వాళ్ళు సింహాద్రితో అంటారు. ఇప్పుడు తోటని నాకు ఎక్కవ ధరకి అమ్మి పెట్టండి అని వాళ్ళతో సింహాద్రి అంటాడు. అప్పుడే సూర్య వచ్చి రౌడీలపై కోప్పడతాడు. సూర్య వాళ్ళు నా బిజినెస్ పార్టనర్స్ అని సింహాద్రి అనగానే ఆ రోజు వాళ్ళు అమ్మని ఎంత అవమానించారని సూర్య అనగానే అవన్నీ వదిలేయ్ అని సింహాద్రి అంటాడు.
వాళ్లని పంపించి సూర్య పై కోప్పడతాడు సింహాద్రి. మరొకవైపు నందు తన అమెరికాకి సంబందించిన ఫొటోస్ అన్ని కాల్చేస్తుంది. ఏంటి అక్క ఇదంతా అని జాను అడుగుతుంది. ఇదంతా నువ్వు కావాలనే చేసావ్ పెళ్లి కొడుకు గురించి నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు.. పెళ్లి మండపంలో చెప్పి మురళి బావని పెళ్లి చేసుకోవడానికి కారణం అయ్యావని నందు ఏడుస్తుంది. తరువాయి భాగంలో నందుకి మురళికి ఫస్ట్ నైట్ జరిపించాలని పెద్దావిడ నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |